గంజాయితో పట్టుబడ్డ యువకులు..!
ఏలూరు: కామవరపుకోటలో సోమవారం తడికలపూడి SI వల్లి పద్మ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేసి 2.5 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్‌లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.