నేడు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

నేడు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

NRML: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సాయంత్రం తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని సూచించారు.