రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు.. స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి అధికారులు, మందమర్రి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టారు. యాపల్, KK2 ఏరియాలలోని సర్వీస్ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు శాశ్వత పరిష్కారంగా గురువారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత పట్ల పోలీసులు చూపుతున్న నిబద్ధత, నిరంతర కృషి అభినందనీయమని ప్రజలు పేర్కొన్నారు.