అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

PLD: రెండు దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి దోచుకున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. సోమవారం కారంపూడి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రహదారిని ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు తమ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సహకరిస్తున్నారని అన్నారు.