విశాఖలో రాజ్యాంగ నైతికతపై భారీ సదస్సు

విశాఖలో రాజ్యాంగ నైతికతపై భారీ సదస్సు

విశాఖలో రాజ్యాంగ నైతికతపై భారీ సదస్సు నిర్వహించనున్నట్లు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవీ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ భవన్‌లో కరపత్రం, గోడపత్రికలను ఆవిష్కరించారు. లౌకిక, సోషలిస్టు పదాలను రాజ్యాంగం నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.