'పేదవాడి తలరాత మారుతుంది'

BDK: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మంగళవారం వికలాంగుల కుటుంబం ఆహ్వనం మేరకు వారి ఇంటికి వెళ్ళి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా ఇస్లావత్ రాజేశ్వరి అనే వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. ప్రజా ప్రభుత్వంలో పేదవాడి తలరాత మారే క్షణం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.