అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు: DEO
GNTR: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు DEO సి.వి. రేణుక శనివారం తెలిపారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు సమాచారాన్ని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.