ఎక్సావేటర్ పని తీరు పరిశీలన
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ మంగళవారం స్థానిక కళాశాల సమీపంలో మురుగు నీటి కాలువల్లో వ్యర్థాలను తొలగించే ఎక్సావేటర్ మిషన్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మురుగునీటి ప్రవాహంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కాలువల్లో తొలగించిన ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రాసెస్ కోసం తరలించాలని ఆదేశించారు.