ఆస్పత్రికి కుర్చీల విరాళం

MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న పల్లె దవఖానకు దంపతులు కుర్చీలను అందజేసి మంచి మనసును చాటుకున్నారు. ఆ గ్రామానికి చెందిన బండ శ్రీనివాస్ అపరంజిత దంపతులు ఆదివారం రూ. 14,000 విలువచేసే త్రీ సీటర్ సెట్‌లను ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ గంగాదేవికి అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ గంగాదేవి, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ నాయకులు బొంతల మల్లేష్ ఉన్నారు.