ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి: ఎంపీడీవో

NLG: భూగర్భ జలాలను సంరక్షించుకునేందుకు ఇంటి పరిసరాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. మండలంలోని ఉరుమడ్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం ఇంకుడు గుంత నిర్మాణానికి ఆ గ్రామ నాయకులు, ఉపాధ్యాయ బృందంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరు గుర్తించాలని పేర్కొన్నారు.