VIDEO: వైద్యం కోసం వెళ్తే ప్రాణాపాయం..!!
SRPT: నూతనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. చికిత్స అందించే గది పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు,సిబ్బంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రమాదకర స్థితిలోనే వైద్యం అందిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అధికారులు చెబుతున్నా ఫలితం లేదు. ప్రమాదం జరగకముందే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.