శ్రీకాకుళం జిల్లాలో అమెరికా సుంకాల ప్రభావం!

SKLM: అమెరికా సుంకాల ప్రభావం జిల్లా ఆక్వా రంగంపై పడింది. జిల్లా వ్యాప్తంగా 11 తీర ప్రాంత మండలాల్లో సుమారు 4 వేలకు పైగా హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. రణస్థలం, గార, సంతబొమ్మాలి, సోంపేట, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో అధికంగా చేపలు చెరువులు సాగు చేస్తున్నారు. వీటిలో సుమారు 15 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా అమెరికాకి ఎగుమతులు జరుగుతాయి.