మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్
నంద్యాల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 26 మంది మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి రూ. 1,30,000 జరిమాన విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ప్రజల రక్షణ కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.