పశ్చిమాసియాకు భారీగా యూఎస్ దళాలు
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతూ US అధ్యక్షుడు ట్రంప్ భారీగా స్పెషల్ ఆపరేషన్ దళాలను మోహరించారు. ఇప్పటికే మెరైన్లు, పారాట్రూపర్లు ఉండగా, తాజాగా నేవీ సీల్స్, ఆర్మీ రేంజర్లు అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతానికి వీరికి విధులు కేటాయించలేదు. అయితే హర్మూజ్ జలసంధి రక్షణ లేదా ఖర్గ్ చమురు కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడమే వీరి లక్ష్యమని సమాచారం.