అప్పారావు నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు. అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, ఉమశంకర్‌ల ద్వారా అతని కార్నియాలు సేకరించారు.