రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి కీలక వ్యాఖ్యలు

TG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇవాళ గాంధీ భవన్‌లో మల్లురవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలన్నారు. తమకు ఫిర్యాదు రాలేదు కాబట్టే కోమటిరెడ్డి విషయంలో చర్చ జరగలేదన్నారు.