కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. నెలకు రూ. 18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.