'కౌతాళంకు 2 వేల టన్నుల యూరియాను సప్లయి చేయాలి'

'కౌతాళంకు 2 వేల టన్నుల యూరియాను సప్లయి చేయాలి'

KRNL: కౌతాళం మండలానికి 2 వేల టన్నుల యూరియాను సప్లయి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు డిమాండ్ చేశారు. గురువారం ఆదోనిలోని వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌతాళం మండలంలోని వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారన్నారు.