VIDEO: "వెంటనే చెత్త కుప్పలను శుభ్రం చేయాలి"
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని తిర్మలాయపల్లి రహదారి వద్ద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ పరిసరాలు అధ్వానంగా మారాయి. పైప్‌లైన్ లీకేజీలతో బురదగా మారిన చోట కొందరు చెత్త వేయడంతో తీవ్ర దుర్వాసన వ్యాప్తి చెందుతున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారుల స్పందించి పైప్‌లైన్ లీకేజీ మరమ్మత్తులు.. చెత్త కుప్పలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.