పెద్దదోర్నాలలో చిరుతపులి సంచారం కలకలం
ప్రకాశం: పెద్దదోర్నాలలో చిరుతపులి సంచరిస్తుందన్న వార్తలు కలకలం రేపాయి. స్థానిక కేజీబీవీ వెనుక పంట పొలాల్లో శుక్రవారం చిరుతు తిరుగుతుందని రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన దోర్నాల అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాతో దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. దాని జాజ ఎక్కడ కనిపంచలేదని, శనివారం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అటవి క్షేత్రాధికారి హరి తెలిపారు.