రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

అల్లూరి: కొయ్యూరు మండలంలోని రామరాజుపాలెం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. నడింపాలెం గ్రామానికి చెందిన పాంగి బెన్నస్వామి అనే యువకుడిని రామరాజుపాలెం సమీపంలో బైక్‌పై వెళ్తున్న మరో యువకుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడినవారిని కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు.