భారత్-పాక్ ఉద్రిక్తలపై చర్చించనున్న UNSC

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) అత్యవసరంగా భేటీ కానుంది. పాక్ కోరిక మేరకు క్లోజ్డ్ కన్సల్టేషన్ జరగనుంది. భారత్ చర్యలు ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని వాదిస్తూ, సింధు జలాల ఒప్పందం వంటి అంశాలను పాక్ UNSC దృష్టికి తీసుకురానుంది. మరోవైపు, పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న విషయాన్ని భారత్ నొక్కిచెప్పనుంది.