నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫియా

NLG: జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇష్టారాజ్యంగా మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. మెడికల్ షాపుల నిర్వాహకులు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా మందు బిళ్లల నుంచి ఇంజెక్షన్ల వరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సొంత ఫార్మసిస్టులు లేక అద్దె సర్టిఫికెట్‌తో మెడికల్ షాపులను నడుపుతున్నారు.