నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: ఆచంట మండల వ్యాప్తంగా ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ ఏఈ మన్నెం రామారావు తెలిపారు. మార్టేరు నుంచి వచ్చే విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆచంట, వల్లూరు సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.