VIDEO: భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
HNK: నగరంలోని 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.