నేడు జాతరకు హాజరుకానున్న ఎమ్మెల్యే కోరం

MHBD: గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జరుగుతున్న కొండలమ్మ జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరవుతారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ధనియాకుల రామారావు ఓ ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేయనున్నారని తెలిపారు.