నేడు పిట్లంలో బైక్ ర్యాలీ
కామారెడ్డి నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రావు నియోజవర్గానికి వస్తున్న నేపథ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని మండల నాయకులు తెలిపారు. ఈ ర్యాలీ నర్సింగ్ రావు పల్లి నుంచి సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం కృతజ్ఞత సభ నిర్వహిస్తామన్నారు.