స్వగ్రామం చేరిన వలస జీవీ మృతదేహం

స్వగ్రామం చేరిన వలస జీవీ మృతదేహం

SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపల్లి సతీష్ అనే వ్యక్తి మృతదేహం గల్ఫ్ నుంచి మంగళవారం స్వగ్రామానికి చేరింది. సతీష్ బతుకు దెరువు నిమిత్తం మస్కట్‌కు వలస వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. శవ పేటికను స్వగ్రామానికి తరలించగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.