'యూరియాపై రైతుల్లో ఆందోళన వద్దు'
BHNG: యూరియాపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కావలసినంత స్టాక్ సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్లో విలేకర్లతో మాట్లాడారు. గత ఏడాదిలో ఈ సీజన్ కు 23000 బస్తాలు సరఫరా అయ్యాయని, ఈ సీజన్‌లో ఇప్పటికే మండలానికి 48,000 బస్తాలను సరఫరా చేశామని తెలిపారు.