రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద నివారించాలని వినతి

రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద నివారించాలని వినతి

E.G: రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడదను నివారించాలని రైల్వే స్టేషన్ మేనేజర్ ఏవీఎస్ రంగనాథ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు యానాపు ఏసు కోరారు. ఈ మేరకు రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్‌కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. కుక్కల బెడదను శాశ్వతంగా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.