వర్ధన్నపేట నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

వర్ధన్నపేట నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

WGL: వర్ధన్నపేట మండలం నూతన ఎస్సైగా సాయిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముల్కనూర్ ఎస్సైగా పనిచేసిన ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా ఈ పదవిని చేపట్టారు. ఇక్కడి మాజీ ఎస్సై భూక్య చందర్ టాస్క్ ఫోర్స్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.