నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. పవర్ ఆఫీస్ వెనక వీధి, ఎస్సీ బీసీ కాలనీలు, విద్యానగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.