బొండపల్లిలో బీజేపీ కార్యాలయం ప్రారంభం
VZM: విజయనగరం జిల్లా బొండపల్లి మండల భవన సముదాయం సమీపంలో ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ముందుగా వీర్రాజును ఓబీసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొగ్గ దేవుడు బాబు, దేవర ఉదయ్ కిరణ్ పర్యవేక్షణలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.