మిడ్‌మానేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సిరిసిల్ల: భారీ వర్షాల కారణంగా ఎస్‌ఆర్‌ఎస్పీ నిండడంతో మిడ్‌మానేరుకు 9,799 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. మిడ్‌మానేరు పూర్తి స్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత ప్రాజెక్టులో 13.30 టీఎంసీలుగా నీరునిల్వ ఉందని మిడ్‌మానేరు అధికారులు పేర్కొన్నారు. గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు.