మల్లన్న దర్శనం పరమ పవిత్రం: ఎమ్మెల్యే అనిల్

మల్లన్న దర్శనం పరమ పవిత్రం: ఎమ్మెల్యే అనిల్

ADB: ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో స్వయంభువుగా వెలిసిన పురాతన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలయాన్ని ప్రతి ఏటా దర్శించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.