ఫ్లాష్. కాలు జారిపడిన ఎమ్మెల్యే

ఫ్లాష్. కాలు జారిపడిన ఎమ్మెల్యే

SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కాలు జారి పడ్డారు. దీంతో కాలుకు స్వల్ప గాయమైందని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. దేవుని కృప, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే మళ్లీ ప్రజా సేవలోకి వస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.