బోట్స్‌వానాలో రాష్ట్రపతికి 8 చీతాల అందజేత
బోట్స్‌వానాలో భారత రాష్ట్రపతి ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు గిడియోన్ 8 చీతాలను అప్పగించారు. గబోరోనేకు సమీపంలో ఉన్న మోకోలోడి నేచర్ రిజర్వ్‌లో 2 పెద్ద చీతాలను క్వారంటైన్ నుంచి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణ కోసం బోట్స్‌వానా చేస్తున్న కృషిని ముర్ము అభినందించారు. అదే సమయంలో భారత్ కూడా చీతాల రక్షణకు కట్టుబడి ఉందన్నారు.