ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్వో
JGL: కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్‌ని డిప్యూటీడీఎంహెచ్‌వోగా పదోన్నతి పొందిన డా. జైపాల్ రెడ్డి శనివారం కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే సంజయ్ డా. జైపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.