స్కూల్ బిల్డింగ్‌పై నుంచి పడి విద్యార్థికి గాయాలు!
MBNR: జడ్చర్ల పట్టణంలోని ఓ గురుకుల పాఠశాలలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనను గోప్యంగా ఉంచి ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, అనంతరం HYD తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.