'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
పార్వతీపురం మండలం నర్సిపురం పంచాయతీ హెచ్.కారడవలస గ్రామంలో శుక్రవారం డ్రై డే ఫ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి DRDA ఏం.సుధారాణి మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు.