'గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేయాలి'
సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండేట్, డీఎంహెచ్వో పాల్గొన్నారు.