విగ్రహ ప్రతిష్టాపన.. కేంద్ర మంత్రికి ఆహ్వానం

విగ్రహ ప్రతిష్టాపన.. కేంద్ర మంత్రికి ఆహ్వానం

KNR: శంకరపట్నం మండలంలోని పాపయ్య పల్లిలో మే 1న నిర్వహించనున్న శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గ్రామస్థులు కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్, మేయర్ శ్రీనివాస్‌ను కలిసి, విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు రావాలని కోరారు.