కూసుమంచిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా
KMM: కూసుమంచి మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డులో ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. జక్కేపల్లి నుంచి కూసుమంచి వైపుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ నేలకొండపల్లి రోడ్డులోని వైన్స్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. దీంతో ఇసుక రోడ్డుపై పడటంతో కొంత ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.