BREAKING: కోట ఇంట్లో మరో విషాదం

BREAKING: కోట ఇంట్లో మరో విషాదం

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. కోట సతీమణి కోట రుక్మిణి కన్నుమూశారు. 1968లో రుక్మిణిని కోట శ్రీనివాసరావు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వారి కుమారుడు కోట ప్రసాద్‌ 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కాగా, ఈ ఏడాది జూలై 13న కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే.