గ్యాస్ గోడౌన్‌‌ను తనిఖీ చేసిన ఆర్డీవో

గ్యాస్ గోడౌన్‌‌ను తనిఖీ చేసిన ఆర్డీవో

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని గ్యాస్ గోడౌన్‌ను పెనుకొండ RDO ఆనంద్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను పరిశీలించి రికార్డులను సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్లను కేవలం హోమ్ డెలివరీ ద్వారానే అందించాలని గోడౌన్ డీలర్‌కు ఆదేశించారు. ఈ తనిఖీలో సోమందేపల్లి తహసీల్దార్ మారుతి పాల్గొన్నారు.