ప్రైవేట్ ఆసుపత్రులకు డీఎంహెచ్‌వో నోటీసులు

GNTR: గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె.విజయలక్ష్మీ శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని రెండు ఆసుపత్రుల్లో ధరల పట్టిక, వెంటిలేషన్ సదుపాయం లేకపోవడాన్ని గమనించి ఆ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అల్లోపతి యాక్ట్‌ని అతిక్రమించిన ఆసుపత్రులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.