13న జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

ప్రకాశం: పామూరు పట్టణంలో ఏప్రిల్ 13న జరిగే జనవిజ్ఞాన వేదిక జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెన్న కృష్ణ కోరారు. శిక్షణ తరగతులకు సంబంధించిన ఆహ్వాన కరపత్రికలను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఉదయం 10గంటలకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని, శిక్షణ తరగతులకు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు.