'ప్రభుత్వ వైద్య కళాశాలలపై అనిత వ్యాఖ్యలు అబద్ధం'

'ప్రభుత్వ వైద్య కళాశాలలపై అనిత వ్యాఖ్యలు అబద్ధం'

KDP: శుక్రవారం హోమ్ మినిస్టర్ అనిత చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని తులసి రెడ్డి తెలిపారు. ఇవాళ వేంపల్లిలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాలు పునాది దశలోనే ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ నిధులు అవసరమని, ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, అందుకే ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడం దురదృష్టకరమని తులసి రెడ్డి మండిపడ్డాడు.