రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం

KRNL: గోనెగండ్ల మండలం పుట్టపాశం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ లారీని ఢీకొనడంతో ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన గోపాల్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.