రాజన్న ఆలయంలో అద్దాల మండపం తొలగింపు పూర్తి
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో అద్దాల మండపం తొలగింపు పూర్తయింది. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఫ్లోరింగ్ పూర్తిగా తొలగించారు. అద్దాల మండపం తొలగించి శిథిలాలు తరలించారు. ఉత్తరం వైపు ప్రాకారం పూర్తిగా తీసివేయడంతో పాటు బాల రాజేశ్వర ఆలయ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించారు.